హీరో రామ్ పోతినేని తాను నటించబోయే 23వ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్ పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం సాంప్ర దాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిర్మాత కృష్ణ పోతినేని స్క్రిప్ట్ ను రామ్ పోతినేనికి అంద జేశారు. ముహూర్తపు సన్నివేశానికి పి. మురళీ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పి.వి. రవి కిషోర్ క్లాప్ కొట్టారు. దర్శకుడిగా తన ప్రయాణానికి శ్రీకారం చుడుతూ తొలి షాట్‌కు రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా హైదరాబాద్ శివార్లలో ప్రారంభమైంది. చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఒరిజినల్ కథను స్వయంగా రామ్ పోతినేని రాశారు. నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీనిని రూపొంది స్తున్నారు. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విభిన్న అంశాలను, ఆసక్తికరమైన పాత్రల ప్రయాణంతో ఈ చిత్రం ఉండబోతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.
రామ్ సినిమా మొదలైంది
- Advertisement -
- Advertisement -



