Monday, June 29, 2026
E-PAPER
Homeసినిమా'నాగబంధం `సర్ర్పైజ్ చేస్తుంది

‘నాగబంధం `సర్ర్పైజ్ చేస్తుంది

- Advertisement -

విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించారు.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగ పతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ కీలక పాత్రధారులు. జూలై 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఇప్పటివరకు ఇలాంటి పాత్ర నేను చేయలేదు. ఇందులో నేను పార్వతి పాత్రలో కనిపిస్తాను. తను ఒక వేద విద్యార్థిని. తన పాత్ర ఎమోషనల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తన కుటుంబం కోసం, ప్రేమ కోసం ఎంతవరకైనా నిలబడే వ్యక్తిత్వం ఆమెది. కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పార్వతి తీసు కునే ప్రతి నిర్ణయం కథపై ప్రభావం చూపుతుంది. నా పాత్ర చూసి ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ అవుతారు.
దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన పాటలో నటించటం ఆనందంగా ఉంది. ఇలాంటి పాటను కూడా నేను ఇప్పటి వరకు చేయలేదు.
ఈ సినిమా కోసం నిర్మించిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ నిజంగా ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. ఆ సెట్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. ప్రేక్షకులను కూడా ఆ విజువల్స్ తప్పకుండా మెస్మరైజ్ చేస్తాయి.
డైరెక్టర్ అభిషేక్ నామా ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. కథ మీద నమ్మకంతో నిర్మాతలు రూ.110 కోట్లు ఖర్చు పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -