Tuesday, June 30, 2026
E-PAPER
Homeసినిమాఈసారి దైవిక నేపథ్యంలో…

ఈసారి దైవిక నేపథ్యంలో…

- Advertisement -

‘అరవింద సమేత` వంటి విజయవంతమైన సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం దైవిక నేపథ్యంతో పురాణాల స్ఫూర్తితో సాగే కథనం, లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠ భరితమైన యుద్ధ సన్నివేశాలు, అద్భుతమైన సరికొత్త ప్రపంచ నిర్మాణంతో ప్రేక్షకులకు అపూర్వ మైన అనుభూతిని అందించనుంది అని మేకర్స్ తెలిపారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చిన బాబు), ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ నున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్రీకరణ షెడ్యూల్ తదితర వివరాలను చిత్ర యూనిట్ త్వర లోనే అధికారికంగా ప్రకటించ నుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -