- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తొలి అడుగుతోనే వెయ్యి మైళ్ల ప్రయాణంలా సాగిన సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై ఈ జులై 4 నాటికి 20 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా జులై 4న సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ జన్మభూమి అయిన మిడ్జిల్లో పర్యటించి, ప్రజాప్రతినిధిగా 20వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి, బహిరంగ సభలోనూ పాల్గొననున్నారు. తన ప్రస్థానానికి పునాదిగా నిలిచిన మిడ్జిల్ ప్రజలకు వరాలూ ప్రకటించే అవకాశం ఉంది.
- Advertisement -



