Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రత్యేక ఓటరు జాబిత సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలి

ప్రత్యేక ఓటరు జాబిత సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలి

- Advertisement -

– సర్పంచ్ పడంపల్లి విజయ కూమారి
నవతెలంగాణ – జుక్కల్

మండల పరిధిలోని పడంపల్లిలో మంగళవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ బీల్ఎల్ఓ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ విజయ కుమారి అధ్యక్షతన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సర్ సర్వేను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఇందుకు ఓటర్లు అధికారులకు సహకరించాలని కోరారు. ఇంటింటికి వెళ్ళి ఎమ్యునరేషన్ ఫారాలు అందజేయాలని కార్యదర్శికి సూచించారు. సర్వేపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జీపీఓ, జీపీ కార్యదర్శిలను ఆదేశించారు.

అనంతరం జీపీఓ, సెక్రటరీ మాట్లాడుతూ..ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వెన్నెముక వంటిదని తెలిపారు. సర్ సర్వే ద్వారా గ్రామంలోని మరణించిన వారి ఓట్లను తొలగించడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రస్తుతం బతికిఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ సజావుగా.. ఎలాంటి తప్పులు దొర్లకుండా సాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో సర్పంచ్ విజయ కూమారితో పాటు ఉప సర్పంచ్ పావుడే సవిత, జపి కార్యవర్గ సభ్యులు, జిపి కార్యదర్శి, జీపీఓ, గ్రామస్తులు నాధుడే సరస్వతి , ఎల్ .  గజానన్, పి. మారుతి, హెచ్. బస్వంత్, హెచ్ . వీరభద్ర, పి. హన్మవ్వ, ఎమ్. మల్లికార్జున్, కే. మాధవరావు, పి. శంకర్, హుల్లాజి, కామ్ దార్ బాలు,  చాకలి లక్ష్మీ, వాగ్మారే సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -