Tuesday, June 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బా విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

కస్తూర్బా విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినీలకు మంగళవారం (యూనిఫామ్) ఏకరూప దుస్తులను మండల తాసిల్దార్ ఎండి ముజీబ్, ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్, మండల ప్రజా ప్రతినిధులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. కస్తూర్బా పాఠశాల అభివృద్ధికి ప్రత్యేకంగా అభివృద్ధి పథంలో నడిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఏపిఎం తో పాటు కస్తూరిబా పాఠశాల ప్రిన్సిపాల్ పాఠశాల ఉపాధ్యాయులు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, నాయకులు సంతోష్ మేస్త్రి, రామ్ పటేల్, ఈరన్న, సుదర్శన్ మున్నా, ఐకెపి సిబ్బంది పాఠశాల సిబ్బంది విద్యార్థినీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -