Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ హైస్కూల్..100కు చేరిన అడ్మిషన్ల సంఖ్య

జుక్కల్ హైస్కూల్..100కు చేరిన అడ్మిషన్ల సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
రోజురోజుకు ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పుంజుకుంటోందని మండల విద్యాధికారి తిరుపతయ్య అన్నారు. బుధవారంతో జుక్కల్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల సంఖ్య 100కి చేరడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు రానున్న రోజుల్లో పూర్వ వైభవం సంతరించుకుంటుందని అన్నారు. 2025-2026 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల్లో ఉత్తమ ఫలితాలు సాధించాంని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉన్న పాఠశాలలో జుక్కల్ హైస్కూల్ మొదటివరుసలో ఉందన్నారు.

బాలుర, బాలికల హైస్కూల్స్ వేర్వేరుగా భవనాలు నిర్మిస్తే అడ్మిషన్లు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ బడుల్లో అపార అనుభవమున్న ఉపధ్యాయ బృందం ఉందని, ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన భోదన లభిస్తుందని తెలిపారు. విద్యార్థులను వారి తలిదండ్రులు సర్కార్ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత బుక్స్, యూనిఫామ్స్, షూస్, భోజన వసతులను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ K. హన్మంత రెడ్డి , ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేస్తూ.. తమ పాఠశాలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను చేర్పిస్తున్న తల్లిదండ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యాబోధన అందించడమే మా లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. అనంతరం ఎంఈఓ ,స్థానిక ప్రజా ప్రతినిధులు, సహకరిస్తున్న గ్రామ పెద్దలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -