– అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహించొద్దు: జిల్లా ఎస్పీ
నవతెలంగాణ – కామారెడ్డి
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జూలై 1 నుంచి జూలై 31 వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు. ఈ చట్టం అమలులో ఉన్న సమయంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే ప్రజా ధనానికి నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలను ఉల్లంఘించి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
కామారెడ్డిలో నెలరోజుల పాటు 30, 30(ఎ) యాక్ట్ అమలు
- Advertisement -
- Advertisement -



