Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేసిన సర్పంచ్

బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందజేసిన సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో బాలింతలకు, గర్భిణీలకు బుధవారం జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్ పౌష్టికాహారం అందజేశారు. అదేవిధంగా నూతనంగా అడ్మిషన్ తీసుకున్న చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం బాలింతలకు, గర్భిణీలకు, బాలామృతం అందించారు. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని అన్నారు. ప్రతి ఒక్కరు పిల్లలకు విద్యను అందించేందుకు ప్రభుత్వం పౌష్టికాహారంతో పాటు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగడి టీచర్తో పాటు గ్రామ సర్పంచ్, జిపి కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -