Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్ సైడ్ ప్లాంటేషన్ చేసేందుకు గుంతలను పరిశీలించిన ఎంపీడీవో

రోడ్ సైడ్ ప్లాంటేషన్ చేసేందుకు గుంతలను పరిశీలించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
మండల కేంద్రంలోని రోడ్లు మరియు భవనాల శాఖ రోడ్ సైడ్ ప్రాంతంలో ప్లాంటేషన్ చేసేందుకు ఉపాధి హామీ పథకంలో భాగంగా గుంతలను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో వర్షాలు అడపా దడప పడుతున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి హమీ పథకంలో భాగంగా ప్రతి ఎటా ప్రభుత్వ స్థలాలలో ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నదని అన్నారు. గతంలో నాటిన మొక్కలు చనిపోయిన ప్రదేశంలో కొత్త మొక్కలు నాటాలని , ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఉన్నచోట గుంతలు తీసి ఈ సంవత్సరం నర్సిరీలలో పెంపకం నిర్వహించిన మొక్కలను తీసుకువచ్చి నాటాలని ఉపాధి హామీ అధికారులకు ఆదేశించారు. నాటిన మొక్కలకు సంరక్షణ బాధ్యత తీసుకొని , నిర్లక్ష్యం చేయకుండా కచ్చితంగా మొక్కల పెంపకం పకడ్బందీగా నిర్వహించాలని  ఫీల్డ్ అసిస్టెంట్ కు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఉపాధిహమీ ఈసీ స్వామి దాస్, టెక్నికల్ అసిస్టెంట్, జిపి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -