Saturday, February 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరోడ్డుపై కూలిన విమానం.. 12 మంది మృతి

రోడ్డుపై కూలిన విమానం.. 12 మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బొలీవియన్ రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో బొలీవియన్ ఎయిర్ ఫోర్స్ హెర్క్యులస్ C-130 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మరణించినట్లు సమాచారం. విమానం దేశంలోని ఇతర ప్రాంతాలకు కొత్త నోట్లను తీసుకువెళుతోందని, అయితే ప్రమాదం కారణంగా నోట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయని సమాచారం. విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

స్థానిక మీడియా (ఎల్ డెబర్, యునిటెల్) ప్రకారం, విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ సమయంలో రన్‌వేపై నుంచి జారిపడి, విమానాశ్రయ సరిహద్దు మెష్‌ను చీల్చుకుపోయి, రోడ్డుపై ల్యాండ్ అయింది. విమానం అనేక కార్లు, వాహనాలను ఢీకొట్టడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో కనీసం 12 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని నివేదికలు వెల్లడించాయి. బొలీవియన్ పోలీసులు, అగ్నిమాపక దళాలు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. విమానంలో ఉన్న వ్యక్తుల సంఖ్య, వారి పరిస్థితులు ఇంకా బొలీవియన్ వైమానిక దళం లేదా ప్రభుత్వం నుండి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -