Thursday, July 2, 2026
E-PAPER
Homeమానవిఏ చాపింగ్‌ బోర్డు ఉత్తమం!

ఏ చాపింగ్‌ బోర్డు ఉత్తమం!

- Advertisement -

వంటగది వస్తువుల్లో చాపింగ్ బోర్డు ముఖ్యమైనది. వంట చేసేటప్పుడు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వంటగది ఫ్లాట్‌ఫారమ్‌ను మురికిపడకుండా చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే మార్కెట్లో లభిస్తున్న ప్లాస్టిక్, స్టీల్, చెక్క వంటి వివిధ రకాల చాపింగ్ బోర్డులను ఉపయోగించేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చెక్క కటింగ్ బోర్డులు : ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండి, అందరి బడ్జెట్‌కు సరిపోయేలా లభిస్తాయి. బరువుగా ఉండటం వల్ల కూరగాయలు కోసేటప్పుడు అస్సలు జారవు. చెక్క బోర్డులను సరిగ్గా కడిగి ఆరబెట్టకపోతే, అవి త్వరగా పాడైపోయి బ్యాక్టీరియాకు నిలయంగా మారుతాయి. ముఖ్యంగా వీటిపై మాంసం, చేపలు వంటివి కోసినప్పుడు సరైన పరిశుభ్రత పాటించకపోతే క్రిములు వేగంగా పేరుకుపోతాయి. ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు : ధర పరంగా చూస్తే ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు చాలా చౌకగా లభిస్తాయి. అయితే రోజువారీ వంటకాల్లో ప్లాస్టిక్ బోర్డులను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పబ్‌మెడ్ సెంట్రల్ పరిశోధనల ప్రకారం, ప్లాస్టిక్ బోర్డులపై కత్తితో కూరగాయలు లేదా మాంసం కోసేటప్పుడు చిన్న గాడులు ఏర్పడతాయి. వీటిలో ఆహారపు రేణువులు ఇరుక్కుపోయి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు పెరగడానికి దారితీస్తాయి. ఇవి ఆహారంలో కలవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
స్టీల్ చాపింగ్ బోర్డులు : ప్రస్తుత కాలంలో స్టీల్ చాపింగ్ బోర్డులకు ఆదరణ పెరుగుతోంది. వీటిని మెయింటైన్ చేయడం చాలా సులభం. ఇవి చెక్క బోర్డుల్లా పగుళ్లు రావు, ప్లాస్టిక్‌లా గీతలు పడవు. వీటికి అంత త్వరగా తుప్పు కూడా పట్టదు. రీసెర్చ్‌గేట్.నెట్ ప్రకారం, స్టెయిన్‌లెస్ స్టీల్ చాపింగ్ బోర్డుల ఉపరితలంలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పెరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఆరోగ్యం, పరిశుభ్రత దృష్ట్యా చూస్తే స్టీల్ చాపింగ్ బోర్డులు మిగిలిన వాటికంటే ఎంతో సురక్షితమైనవిగా నిపుణులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -