Wednesday, July 22, 2026
E-PAPER
Homeహైదరాబాద్నిలోఫర్ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన డా. స్వప్న

నిలోఫర్ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన డా. స్వప్న

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నియోనాటాలజీ విభాగాధిపతి డా. స్వప్న ఆసుపత్రి పరిపాలన నుంచి వేధింపులు ఎదుర్కొన్నారనే ఆరోపణల నేపథ్యంలో అస్వస్థతకు గురైనట్లు ఈ రోజు ఉదయం నిలోఫర్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, డా. స్వప్న నిలోఫర్ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ వేధింపుల కారణంగా అస్వస్థతకు గురైనట్లు, జరిగిన విషయాలను గుర్తు పట్టలేకపోతున్నట్లు, మరచిపోయినట్లుగా మాట్లాడుతున్నారని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)కు తరలించి,ఎంఆర్ఐ (MRI) పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. మహిళా వైద్యులు వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో, ఈ ఘటనపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వైద్య వర్గాలు, ఉద్యోగ సంఘాలు ,ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలు, కుటుంబ సభ్యుల వాదనలు ,ఇతర వివరాలపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరణ ఇవ్వలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -