అనుబంధ వృత్తుల వారినీ ఆదుకోవాలి
తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి : గంజి మురళీధర్
పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ డైరెక్టర్ అధికారికి వినతి
నవతెలంగాణ- నల్లగొండ టౌన్
అర్హత కలిగిన పవర్లూమ్ కార్మికులందరికీ త్రిఫ్ట్ ఫండ్ పథకం వర్తింపజేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని కోరారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం డెవలప్మెంట్ అధికారి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత జౌళి శాఖ కార్యాలయం మంగళవారం ప్రకటించిన త్రిఫ్ట్ ఫండ్ పథకం లిస్టులో చాలామంది కార్మికుల పేర్లు రాలేదని తెలిపారు. అధికారులు విచారణ చేసిన సమయంలో కిరాయి ఇండ్లలో ఉండే కార్మికులు ఇండ్లు మారడంతో డోర్ లాక్ అని పెట్టడం ద్వారా అర్హత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తిరిగి దరఖాస్తులు స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు. పవర్లూమ్లో పనిచేసే కార్మికులు, అనుబంధ వృత్తుల కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ పథకంలో అవకాశం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పవర్లూమ్ కార్మికులు రూ.1200 జమ చేస్తే ప్రభుత్వం నుంచి రూ.1200 ఇస్తున్నారని, అలా కాకుండా చేనేత కార్మికుల తరహాలో రూ.1200 పొదుపు చేస్తే ప్రభుత్వం రూ.2400 జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, చంద్రయ్య, బుచ్చి రాములు, రాజేష్ తదితరులు ఉన్నారు.
పవర్లూమ్ కార్మికులందరికీ ‘త్రిఫ్ట్’ వర్తింపజేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



