- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా బి.అజిత్‌రెడ్డి బుధవారం రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు ఎండీ హెచ్ఎంఆర్ఎల్ ఉన్నతాధికారులతో ఫేజ్ -1, ఫేజ్-2 తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్త అదనపు ఎండీని కలిసిన వారిలో హెచ్ఎంఆర్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ బి.ఆనంద మోహన్, జనరల్ మేనేజర్లు ఎం.విష్ణువర్ధన్ రెడ్డి, డి.సూర్యప్రకాశం, శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వై.సాయపరెడ్డి ఉన్నారు.
- Advertisement -



