- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అరేబియా సముద్రంలో గస్తీ నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన ఎంహెచ్-60ఎస్ సీహాక్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లోని ఒక సిబ్బంది గల్లంతయ్యారు. అమెరికా నేవీ ఫిఫ్త్ ఫ్లీట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, అత్యవసర ల్యాండింగ్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ హెలికాప్టర్ యూఎస్‌ఎస్ జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ విమానవాహక నౌకపై మోహరించి ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, సముద్ర జలాలపై హెలికాప్టర్ ల్యాండింగ్ చాలా ప్రమాదకరం, నీటిలో తల్లకిందులయ్యే ప్రమాదం ఉంది.
- Advertisement -



