Thursday, July 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిండి కట్టడ నిర్మాణంపై ఆసక్తికర చరిత్ర చెప్పిన ఎమ్మెల్యే

డిండి కట్టడ నిర్మాణంపై ఆసక్తికర చరిత్ర చెప్పిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
డిండి రిజర్వాయర్ నుంచి వానకాలం పంటల సాగు కోసం ఉప్పునుంతల మండలం లాత్తిపూర్ గ్రామం వద్ద డిండి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా సాగునీటిని టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అప్పటి నిజాం ప్రభుత్వం 1941లో రూ.41.80 లక్షల అంచనా వ్యయంతో డిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి, 1943లో సాగులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టును అత్యంత పటిష్టంగా నిర్మించారని, మిగులు నిధులతో బాపనికుంట, చంద్రసాగర్ రిజర్వాయర్లను కూడా నిర్మించారని వివరించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రతి గ్రామానికి తాగునీరు, సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. భూసేకరణను వేగవంతంగా పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.

డిండి రిజర్వాయర్ పరిధిలోని ఉప్పునుంతల మండల రైతులకు సాగునీరు సాఫీగా అందేలా కాలువల మరమ్మతుల కోసం రూ.35 లక్షలు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ఉప్పునుంతల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మండల నాయకులు, డైరెక్టర్లు, చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు, యువజన కాంగ్రెస్ నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -