- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అక్రమ సంబంధం ఉందేమోనన్న అనుమానంతో ప్రశ్నించిన భర్త గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకొంది. ముస్తకీమ్, అలీషా భార్యాభర్తలు. అలీషాకు అక్రమసంబంధం ఉందేమోనని ప్రశ్నించిన ముస్తకీమ్‌ను చంపాలని నిర్ణయించుకొంది అలీషా. ముస్తకీమ్ గుండెలపై కూర్చొని అతని గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. అనుమానంతో భర్త ప్రశ్నించడమే హత్యకు కారణమని పోలీసులు నిర్ధరించారు.
- Advertisement -



