Friday, July 3, 2026
E-PAPER
Homeఆదిలాబాద్రోడ్లు బాగుచేయాలని ఉద్యమకారుడు బిక్షాటన

రోడ్లు బాగుచేయాలని ఉద్యమకారుడు బిక్షాటన

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ తో పాటు అన్ని గ్రామాల్లో రోడ్లన్ని ఆధ్వనంగా గుంతలు ఏర్పడి ఎన్నో ప్రమాదల బారిన పడుతున్నారు. దింతో ప్రజలు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని వాహనాలు నడుపుతన్నా ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించక పోవడంతోనే తెలంగాణ ఉద్యమకారుడు కొత్తూరు శంకర్ శుక్రవారం వినూత్నo గా నిరసన చేపట్టారు. మండలంలోని అన్ని గ్రామ గ్రామాలకు తిరుగుతూ మండల వ్యాప్తంగా బిక్షాటన చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే లు, మరియు ఇప్పటి ఎమ్మెల్యే లకు పలు మార్లు రోడ్లు బాగుచేయాలని చేప్పిన పట్టించుకోవడం లేదనే ఉదేశ్యం తోనే ఈ బిక్షాటన నిరసన కార్యక్రమం చే్వపట్టడం జరుగుతుందని ఉద్యమకారుడు శంకర్ తెలిపారు. ఈ బిక్షటనలో వచ్చిన డబ్బులు రోడ్ల నిర్మాణానికి వినియోగించాలని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశారు.ముఖ్యం గా వర్షకాలం గ్రామమలో రహదారులన్ని మరింత దెబ్బతిని ప్రయాణికులకు వాహనదారులకు అత్యవసర సేవలకు ఇబ్బందులు కల్గుతాయని పేర్కొన్నారు.ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి రహదారుల నిర్మాణాలు  చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -