వర్షాభావ పరిస్థితులతో ప్రభావం
కేర్ ఎడ్జ్ రేటింగ్స్ హెచ్చరిక
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఆహార ద్రవ్యోల్బణం సగటున 6 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
న్యూఢిల్లీ : దేశంలో వర్షపాత లోటు వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రముఖ రేటింగ్ ఎజెన్సీ కేర్ ఎడ్జ్ హెచ్చరించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఆహార ద్రవ్యోల్బణం సగటున 6 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే విధంగా వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5 శాతంగా నమోదు కావచ్చని విశ్లేషించింది. ఈఏడాది జూన్ 1 నుంచి జూన్ 29 మధ్య కాలంలో దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే వర్షపాతం 41.5 శాతం తక్కువగా నమోదు కావడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమని తెలిపింది. ముఖ్యంగా మే నెలలో వంట నూనెల ధరలు ఇప్పటికే 9.5 శాతం పెరగడంతో ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడిని పెంచుతోంది. సేవల ఎగుమతుల రంగం స్థిరమైన పనితీరుతో వాణిజ్య లోటు తగ్గడం సానుకూల పరిణామమని కేర్ ఎడ్జ్ పేర్కొంది.
ఆహార ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరొచ్చు
- Advertisement -
- Advertisement -



