ఆ దేశాలతో దౌత్య, వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకోవాలి : సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పశ్చిమాసియాపైనా, ఆయిల్‌పైనా ఆధిపత్యం కోసం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఇరాన్ అధ్యక్షులు ఖమేనీని 30 అధునాతన ఆయిల్ బాంబులతో హత్యచేసినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. వెనుజులా అధ్యక్షులు మదురోని ఎత్తుకెళ్లి ఆ దేశాన్ని అదుపులోకి తీసుకోవడం, గాజాని మరుభూమిగా మార్చడం, ఈ రోజు ఇరాన్‌పై యుద్ధ ఉన్మాదానికి పాల్పడటం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రపంచ వనరులను కొల్లగొట్టడానికి ప్రపంచ వాణిజ్య, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా, ఇజ్రాయిల్ మారణహోమం చేస్తూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మోడీ, ట్రంప్, నెతన్యాహు త్రయం జాతి విద్వేషాలతో, నరహంతక చర్యలతో అన్నదమ్ముళ్లుగా మారారని ఆరోపించారు. మన దేశం అలీన విధానాన్ని వీడి ప్రపంచ హంతకులతో చేతులు కలపడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలతో మోడీ సర్కారు చేసుకున్న దౌత్య, వాణిజ్య ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్‌పై యుద్ధాన్ని వెంటనే ఆపేలా అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇరాన్‌పై అమెరికా,ఇజ్రాయిల్ దాడిని ఖండించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



