– పాలడుగు వెంకట కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంక్షేమానికి అంకితమైన ప్రజా ప్రభుత్వానికి ఘనంగా కృతజ్ఞతలు తెలుపుతూ క్షీరాభిషేక కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌కు గాను రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, స్థానిక మంత్రి దనసరి సీతక్కకి కృతజ్ఞతలు తెలియజేసి వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా,మండల,గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, పెద్ద సంఖ్యలో పాల్గొని రైతు భరోసా పథకాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేశారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



