నవతెలంగాణ – మిరుదొడ్డి
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో తక్షణ ప్రవేశాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రఘునందన్ రావు తెలిపారు. శనివారం మిరుదొడ్డి మండలం అల్వాల – పెద్ద చెప్యాల కూడలిలోని గురుకులంలో ఆయన మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లాలోని అల్వాల, హుస్నాబాద్, చేర్యాల, చిన్నకోడూరు, కొండపాక, కోహెడ, వర్గల్ లలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంకు గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపిసి, హెచ్ఈసి, సిఇసి, ఎంఇసి విభాగం ఆంగ్ల మాధ్యమంలో మిగిలిన సీట్ల తక్షణ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 6న ఉదయం 9 గంటలకు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల- పెద్ద చెప్యాల కూడలిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల ప్రాంగణంలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్ (తక్షణ ప్రవేశాల) ప్రక్రియకు నేరుగా హాజరుకావాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.



