- ఫ్లిప్‌కార్ట్ గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్ మూడో ఎడిషన్ 2026 జూలై 4 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు 2026 జూలై 3 నుంచే ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
- గోట్ (జి.ఓ.ఎ.టి.) మస్కాట్ మరియు డాన్ ది బఫెలో పాత్రలతో రూపొందించిన కొత్త టెలివిజన్ ప్రకటనలను (టి.వి.సి.లు) ఫ్లిప్‌కార్ట్ విడుదల చేసింది. హాస్యం, విజువల్ వర్డ్‌ప్లే, జెన్ Zను ఆకట్టుకునే కథన శైలితో మరింత తెలివైన, ఎక్కువ ప్రయోజనాలు అందించే షాపింగ్ ఎంపికలను ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది.
- ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులపై వివిధ విభాగాల్లో అత్యుత్తమ ఆఫర్లను వినియోగదారులు పొందవచ్చు. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక ఆఫర్లతో పాటు, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై కూడా ప్రత్యేక ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
నవతెలంగాణ – హైదరాబాద్ : భారతీయ ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడో ఎడిషన్ ‘గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్’ ను ప్రకటించింది. ఈ సేల్ 2026 జూలై 4 నుంచి ప్రారంభం కానుండగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు 2026 జూలై 3 నుంచే ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లోని ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులు పొందే అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పొందిన సాంస్కృతిక పదమైన ‘గోట్ (జి.ఓ.ఎ.టి.)’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ – అన్ని కాలాల్లోనూ అత్యుత్తమమైనది) స్ఫూర్తిగా రూపొందించిన ఈ ప్రచారం, హాస్యం, మీమ్స్, విభిన్న కథన శైలితో జెన్ Z తరాన్ని ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఈ ప్రచారానికి ప్రతీకగా నిలిచే గోట్ మస్కాట్తో పాటు, ‘డాన్ ది బఫెలో’ వంటి వినోదాత్మక పాత్రలు కూడా ఇందులో భాగమయ్యాయి. దీంతో, ఆఫర్లను వెతికే ప్రక్రియను వినోదాత్మక అనుభవంగా మార్చి, వినియోగదారులకు ఆ ఆఫర్లు ఎంత ప్రయోజనకరంగా ఉంటాయో అంతే సరదాగా, పంచుకోవాలనిపించేలా అందించనుంది.
గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్‌కు ఉన్న ఈ ఉత్సాహభరితమైన ప్రత్యేక గుర్తింపును మరింత బలోపేతం చేస్తూ, ఫ్లిప్‌కార్ట్ కొత్త టెలివిజన్ ప్రకటనలను (టి.వి.సి.లు) విడుదల చేసింది. భారీ ఆకర్షణ కలిగిన పాత్రలు, సమకాలీన సాంస్కృతిక అంశాలు, అతిశయోక్తితో కూడిన కథన శైలి ద్వారా ఈ ప్రకటనలు గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్ సరదా ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాయి. ఈ ప్రకటనల్లో ప్రతీకాత్మక గోట్ (జి.ఓ.ఎ.టి.) మస్కాట్ సాధారణ ఆఫర్లను అసాధారణమైన షాపింగ్ అనుభవాలుగా మార్చుతూ కనిపిస్తుంది. దీనికి తోడు, ‘డాన్ ది బఫెలో’ అనే హాస్యభరితమైన లక్కీ చార్మ్ సేల్ సమయంలో మరింత ఆదా చేసుకునేలా కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేస్తుంది. విజువల్ గ్యాగ్స్, చమత్కారమైన పదప్రయోగాలు, దేశీ హ్యూమర్, అలాగే ఇంటర్నెట్ సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక శైలితో రూపొందించిన ఈ ప్రచారం, నేటి డిజిటల్-ఫస్ట్ వినియోగదారుల ఉత్సాహభరితమైన షాపింగ్ భావజాలాన్ని సమర్థంగా ఆవిష్కరిస్తుంది.
ప్రచార టీవీసీ లింకులు:
- గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్ మళ్ళీ వచ్చింది! జులై 4 నుండి ప్రారంభం. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు ఎర్లీ యాక్సెస్ జులై 3 నుండే.
- ది గోట్ (జి.ఓ.ఎ.టి.) మళ్ళీ వచ్చింది… అద్భుతమైన ఫ్లిప్ తో!
- Pఅదృష్టానికి ప్రతీక అయిన డాన్ ది బఫెలో (బైన్స్ ఆఫ్ లక్) ను పరిచయం చేస్తున్నాం.
ఈ ప్రచారం గురించి ఫ్లిప్‌కార్ట్ గ్రోత్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రతీక్ శెట్టి మాట్లాడుతూ, “గత రెండు ఎడిషన్లలో గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్, దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు సంస్కృతి, హాస్యం, విలువలను సమ్మిళితం చేస్తూ ఫ్లిప్‌కార్ట్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ప్రచార వేదికగా ఎదిగింది.
ఈ ఎడిషన్‌తో, ప్రముఖ బ్రాండ్‌లపై అత్యుత్తమ ఆఫర్ల కోసం ఎదురుచూసే వినియోగదారులకు ఇది మరింత ప్రభావవంతమైన షాపింగ్ సందర్భంగా నిలిచేలా మేము దీన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. ఈ ప్రచారంలో రూపొందించిన సరదా ‘గోట్ (జి.ఓ.ఎ.టి.)’ ప్రపంచం, జెన్ జి తో పాటు డిజిటల్-ఫస్ట్ వినియోగదారులతో వారికి దగ్గరైన భాషలో మమేకం కావడానికి మాకు తోడ్పడుతోంది,” అని తెలిపారు.
గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్ సందర్భంగా, ప్రముఖ బ్రాండ్‌ల భాగస్వామ్యంతో మొబైల్‌లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాల విభాగం (హోమ్), ఫర్నిచర్, ద్విచక్ర వాహనాలు తదితర అనేక విభాగాల్లో వినియోగదారులు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ సభ్యులకు 24 గంటల ఎర్లీ యాక్సెస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అలాగే, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం, కేవలం 10 నిమిషాల్లో ₹10 లక్షల వరకు తక్షణ రుణ ఆమోదం, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్తో ₹1,500 విలువైన స్వాగత వౌచర్లు, అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు కూడా అందించబడతాయి.
గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్‌లో వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఆపిల్ ఐఫోన్ 17 ధరను ₹82,900 నుంచి ₹70,999కు, శామ్‌సంగ్ గెలాక్సీ S25 5G ధరను ₹74,999 నుంచి ₹56,999కు తగ్గించారు. ల్యాప్‌టాప్ కొనుగోలుదారుల కోసం ఈ సేల్‌లోనే అత్యంత భారీ ధర తగ్గింపుల్లో ఒకటిగా HP 15 Core 5 ల్యాప్‌టాప్‌ను ₹1,32,489 నుంచి కేవలం ₹63,990కు అందిస్తున్నారు. అదనంగా, శామ్‌సంగ్ 55-అంగుళాల మినీ LED టీవీని ₹59,990 నుంచి ₹37,999*కు అందుబాటులో ఉంచారు. అలాగే, ప్యూమా స్నీకర్లపై వివిధ మోడళ్లలో కనీసం 65 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
*ఇక్కడ పేర్కొన్న ధరలు ప్రెస్ రిలీజ్ విడుదలైన సమయంలో అమల్లో ఉన్నవి మాత్రమే. అవి తదుపరి మార్పులకు లోబడి ఉంటాయి.
ఈ ఆకర్షణీయమైన ప్రయోజనాలతో, గోట్ (జి.ఓ.ఎ.టి.) సేల్ మూడో ఎడిషన్ దేశవ్యాప్తంగా వినియోగదారులకు అత్యుత్తమ విలువతో కూడిన షాపింగ్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ఫ్లిప్‌కార్ట్ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. అదే సమయంలో, అందుబాటు ధరలు, విస్తృత ఎంపిక, సౌలభ్యం, సాంస్కృతిక అనుసంధానాన్ని సమన్వయం చేస్తూ వినియోగదారులకు ప్రత్యేకమైన షాపింగ్ అనుభవాలను అందించడంలో తన నాయకత్వ స్థానాన్ని కూడా మరింత పటిష్ఠం చేసుకుంటోంది.



