Monday, March 2, 2026
E-PAPER
Homeతాజా వార్తలు5న వికారాబాద్‌లో జాబ్‌ మేళా..

5న వికారాబాద్‌లో జాబ్‌ మేళా..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : శుభగృహ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్‌ అబ్దుస్‌ సుభాన్‌ సోమవారం ఒక ప్రకటన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్‌లో మార్చి 05 గురువారం ఉదయము 10:30 గంటలకు జాబ్‌ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. శుభగృహ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో సుమారు 30 కి పైగా ఉద్యోగాలు మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌ పోస్టులు హైదరాబాద్‌ లో ఉన్నాయన్నారు. వీటికి నిరుద్యోగ యువకులు మాత్రమే అర్హులని తెలిపారు.

ఈ ఉద్యోగానికి పదవ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఐ.టి.ఐ, డిప్లొమా, బి-టెక్‌, ఎం.బి.ఏ, విద్యా అర్హత కలిగి ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగాలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఈ జాబ్‌ మేళ ద్వారా ఎంపిక అయినా వారికి నేరుగా ఉద్యోగం కల్పించబడుతుందన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇతర వివరాలకు జాబ్‌ మేళా నిర్వాహకుడు మియా సాబ్‌ 9676047444 ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -