ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ టీమ్ మీడియాకు టీజర్‌ని ప్రదర్శిం చింది. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన ఇతర నటీనటులతో పాటు శివరాజ్‌కుమార్, డాలీ ధనంజయ, ప్రియాంక మోహన్, అదితి బాలన్, దర్శకుడు హేమంత్ ఎం.రావు, నిర్మాత వైశాక్ జె గౌడ, ఛాయాగ్రాహకుడు అద్వైత గురుమూర్తి, సంగీత దర్శకుడు చరణ్ రాజ్, ప్రొడక్షన్ డిజైనర్ విశ్వాస్ కశ్యప్ పాల్గొన్నారు.
టీజర్‌లో ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ మూవీ వరల్డ్ ని అద్భుతంగా చూపించారు. చిత్రాన్ని స్పై డ్రామాగా తెరకెక్కించారు. లెజెండరీ డా.రాజ్‌కుమార్ ‘సీఐడీ999’ని గుర్తుచేస్తూ, నివాళులర్పించేలా ఉంది టీజర్.
సినిమా జరిగే సమయం, మిషన్, అనుభవం ఉన్న ఏజెంట్, వృద్ధిలోకి రావాలనుకుంటున్న ఏజెంట్, మాస్క్ మేన్, వాళ్ల కళ్లుగప్పే చెడ్డ వ్యక్తి, అందమైన తల్లి కథ.. ఆఖరిలో ధనంజయ ఇచ్చే ట్విస్టు.. టీజర్‌లో ప్రతిదీ ఆకట్టుకుంటోంది.
టీజర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు హేమంత్ ఎం.రావు మాట్లాడుతూ,’పదేళ్ల సినిమా జర్నీలో నాకు వైశాఖ్ జె గౌడలాంటి గొప్ప నిర్మాత దొరికారు. ఈ సినిమాను రూపొందించడంలో మాకు అత్యంత పెద్ద సపోర్ట్ శివన్న’ అని చెప్పారు.
‘కన్నడ సినిమా ఇండస్ట్రీకి 92 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఉంది. ప్రేక్షకులు పెట్టే ప్రతి పైసాతో సినిమా మనుగడ సాగుతోంది. అందుకే ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా సినిమాను థియేటర్లలోనే చూడాలని కోరుతున్నాను. పైసా వసూల్ సినిమా అని పక్కాగా చెబుతున్నానుఅని నిర్మాత వైశాఖ్ జె గౌడ అన్నారు. 'ప్రతి లెజండరీ యాక్టర్‌కీ ఓ గురువుండాలి. దర్శకులు అలాంటి పాత్రనే పోషిస్తుంటారు. ధనంజయ మంచి ప్రతిభావంతుడు. స్క్రీన్ మీద అద్భుతంగా కనిపించాడు. తనకి మరిన్ని విజయాలు సొంతం కావాలి. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. మా నిర్మాత డా. వైశాఖ్‌ని, అతని చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా. తను పెరిగి, పెద్దై నా చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. ఆ జనరేషన్‌కి పుట్టన్న కనగళ్, పంతులు, కె.బాలచందర్, భారతిరాజా ఎలాగో, ఈ జనరేషన్‌కి హేమంత్ రావు అలాంటి వ్యక్తి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి అరుదైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. డిఫరెంట్ కథ, స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది అని డా. శివరాజ్‌కుమార్ చెప్పారు.
పక్కా పైసా వసూల్ సినిమా
- Advertisement -
- Advertisement -



