మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
జీఎంపీఎస్ అమరుల యాదిలో
స్ఫూర్తి యాత్ర ప్రారంభం
దొడ్డి కొమురయ్య, నక్క లింగయ్యకు నివాళ్లు
నవతెలంగాణ- దేవరుప్పుల
ఉద్యమంలో విశేష సేవలందించి అమరులైన నాయకుల త్యాగాలు చిరస్మరణీ యమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా జీఎంపీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అమరుల యాదిలో స్ఫూర్తి యాత్ర’ శనివారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామంలో ప్రారంభమైంది. దొడ్డి కొమురయ్య స్తూపానికి జూలకంటి పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అనంతరం అమరుడు నక్క లింగయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. జీఎంపీఎస్ ఏర్పడి 30 ఏండ్లు పూర్తైన సందర్భంగా ఉద్యమంలో విశేష సేవలందించి అమరులైన నాయకుల త్యాగాలను స్మరిం చేందుకు ఈ స్ఫూర్తి యాత్ర చేపట్టినట్టు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యల పరిష్కారానికి నక్క లింగయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. కడవెండిలోని దుబ్బగుట్ట పరిరక్షణ పోరాటంలో ముందుండి నాయకత్వం వహించి, గ్రానైట్ కంపెనీ నుంచి గుట్టను కాపాడటంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆ పోరాటంలో పలువురిపై కేసులు నమోదైనా వెనుకడుగు వేయకుం డా ఉద్యమాన్ని విజయవంతం చేశారన్నారు. గ్రామ సహకార సంఘం అధ్యక్షుడిగా కూడా ప్రజలకు విశేష సేవలు అందించారని తెలిపారు.
ఈ కార్యక్ర మంలో జీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కిల్లె గోపాల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, రాష్ట్ర నాయకులు బొల్లం అశోక్, కడెం లింగయ్య, చల్ల మల్లయ్య, ఒజ్జ వినరు, జిల్లా గౌరవ అధ్యక్షులు శాతం రమేష్, జిల్లా అధ్యక్షులు మోటి దేవేందర్, జిల్లా కార్యదర్శి బాలరాజు, నాయకులు యాదగిరి, భూమండ్ల కుమారస్వామి, ముక్కెర గంగరాజు, నక్క లింగయ్య కుటుంబ సభ్యులు, నక్క కొమరయ్య, ఉపసర్పంచ్ రేణుక పాల్గొన్నారు.
అమరుల త్యాగాలు చిరస్మరణీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



