Sunday, July 5, 2026
E-PAPER
Homeఖమ్మంబేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి

బేతుపల్లి రెవెన్యూ పరిధిలో భూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి

- Advertisement -

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్
నవతెలంగాణ-సత్తుపల్లి 

సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూ పరిధిలో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న ఎంజాయ్ మెంట్ సర్వేను పూర్తిచేసి రైతులకు న్యాయం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని 133, 878, 938,148 సర్వే నెంబర్లలో ఉన్న రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారిందన్నారు. భూములు లేని వారికి రికార్డుల్లో పట్టాదారులుగా ఉండటం, భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు లేకపోవడంతో రైతులకు ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమవుతున్నారని తెలిపారు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా సర్వేల పేరుతో కొన్ని రోజులు వేగవంతం చేసి రాజకీయ నాయకుల జోక్యంతో కాలయాపన చేసి చేతులు దులుపుకోవడం ఆనవైతిగా మారిందని విమర్శించారు. రైతుల భూములకు  సంబంధించి హక్కులు శాశ్వతంగా లభించడం లేదని, ఏళ్ల తరబడి తమ భూముల విషయంలో రైతులు అభద్రతా భావంతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించే దిశగా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. రెవెన్యూ పరిధిలోని మొత్తం భూములను సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు తెలుసుకొని సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా చూడాలన్నారు. లేనియెడల రైతులందరిని ఏకంచేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -