జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నాగేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు (ఎన్యూమరేషన్) ఫారాలను తప్పనిసరిగా నింపాలని, నిర్లక్ష్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకుని తమ వివరాలను సరిచూసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, కొత్త నమోదులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డి, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



