Monday, July 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబంజారా సంస్కృతి, చరిత్రకి ప్రతీక

బంజారా సంస్కృతి, చరిత్రకి ప్రతీక

- Advertisement -

150 సంవత్సరాల క్రితం నిజాం నవాబుల పాలనలో గోర్ బంజారాల జీవితాల్లో చోటుచేసుకున్న యథార్థ సంఘటనలు, చారిత్రక ఆధారాల ప్రాతిపదికగా రూపొందుతున్న చిత్రం ‘గ్యానిధార్. ది లిబెరేట‌ర్ అనేది ట్యాగ్ లైన్. జేకే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సోహన్‌లాల్ రాథోడ్, కేసుల బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కేశునందన్ దర్శకుడు. తెలుగు, బంజారా (గోర్ బోలి), హిందీ మూడు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర పోస్టర్, టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్. నారాయణ మూర్తి, రచయిత వి. విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు వి. సముద్ర, ముంబైకి చెందిన దర్శక, నిర్మాత సంజీవ్ కుమార్ రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరై టీజర్, పోస్టర్లను ఆవిష్కరించారు. రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,'ఒకప్పుడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, పర్షియా, కాబూల్ సరిహద్దుల వరకు దేశవ్యాప్తంగా అఖండమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిన గొప్ప చరిత్ర బంజారాలది. రాజులకు సైతం అప్పు ఇచ్చేంతటి సంపద వారి దగ్గర ఉండేది. అక్బర్ కాలంలో 'మాలోకి' అనే వీరవనిత అక్బర్‌ను సైతం వాదనలో ఓడించి, బంజారాల వ్యాపార మార్గాలను మళ్లీ తెరిపించిన ఘనత ఈ జాతిది.

ఇంతటి ఘనమైన ఇతిహాసం, వీరత్వం కలిగిన రాథోడ్స్, జవాన్స్, పవార్స్ వంటి బంజారాల పూర్వ వైభవం మళ్లీ రావాలి. వారు ఈ దేశాన్ని లీడ్ చేయాలి. ఈ సంస్కృతిని ప్రతిబింబిస్తూ వస్తున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి అని చెప్పారు. ‘మూలవాసుల సంపద మూలవాసులకే చెందాలనే సిద్ధాంతంతో వస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలిఅని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. దర్శకుడు కేశునందన్ మాట్లాడుతూ,'ప్రకృతి పరిరక్షణ కోసం బంజారాలు చేసిన వీరోచిత పోరాటాలు, నవాబుల కాలంలో వారు ఎదుర్కొన్న కష్టనష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాం. రచయిత ప్రేమ్‌ అందించిన ఈ కథను ఎంతో సహజత్వంతో రూపొందించాం అని తెలిపారు. నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు మాట్లాడుతూ,’తండా నుంచి నగరానికి వచ్చి జీవనశైలి మార్చుకుంటున్న నేటి తరం.. తమ తండా గొప్పతనాన్ని, సంస్కృతిని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే, సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని నిర్మించాం` అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -