విజయవాడలో ప్రేక్షకుల కేరింతల మధ్య హీరో కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీమూవీ లవ్ కార్నివాల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఏపీ డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జనసేన పార్టీ నుంచి పంచకర్ల సందీప్ అతిథిగా హాజరయ్యారు. రాజ్ యువరాజ్ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో ఈ సినిమా నుంచి నాలుగో లిరికల్ సాంగ్ 'హొయిలా హొయిలా' రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ,'తెలుగులో ఎన్నో ప్రేమ కథలు చూశాం. కానీ ఈ ప్రేమకథ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ నెల 24న మా మూవీలోని మ్యాజిక్ తెరపై చూస్తారు అని అన్నారు. ‘స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు. స్టీవెన్, నిధి ఇద్దరూ మీ అందరికీ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారుఅని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ చెప్పారు. స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ,'నా ఫస్ట్ మూవీ 'హృదయకాలేయం సక్సెస్ మీట్ ఇదే థియేటర్ లో చేసుకున్నాం. అలాగే ‘బేబిసినిమా ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఈ సినిమాను పది సార్లు చూశాను. తప్పకుండా మీ మనసులు గెలుచుకునే చిత్రమిది. 'బేబి సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉందో ఈ చిత్రంలోనూ అంతకు రెండు, మూడు రెట్లు ఎక్కువగా గొప్ప సినిమా ఇవ్వబోతున్నాంఅని అన్నారు. 'ఈనెల 24 నాకు ఎంతో ఇష్టమైన డేట్. ఆ రోజునే ఇంద్ర, తొలిప్రేమ రిలీజ్ అయ్యాయి. మెగాభిమానిగా నాకు అదొక కల్ట్ డేట్. ఈ నెల 23 నుంచే ప్రీమియర్స్ పడుతాయి. మణిశర్మ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యంతో వస్తున్న మా మూవీ పాటలన్నీ యూత్ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ,’మీతో కలిసి ఈ రోజు “చెన్నై లవ్ స్టోరీ” సాంగ్స్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు మీతో కలిసి సినిమా చూద్దామా అనిపిస్తోంది. ఆ రోజు ఎంతమంది ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటారు, ఎంత మంది మొహాల్లో నవ్వులు పూస్తాయి అని చూడాలని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రామీస్ చేసి చెబుతున్నా, వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమ కథను ఈ సినిమాలో చూడబోతున్నారు. సినిమా చూస్తున్న 3 గంటలు మీరు ఒక లైఫ్ కు కనెక్ట్ అవుతారు. స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఈ సినిమా మీకు చాలా కాలం గుర్తుండి పోతుంది. ఇందులోని ఎమోషన్స్ అన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ‘బేబిసినిమా కంటే ఎక్కువసార్లు ఈ సినిమా చూసేందుకు సిద్ధంగా ఉండండి. 'బేబి కంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి` అని తెలిపారు.
వెండితెరపై మునుపెన్నడూ చూడని ప్రేమ కథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



