Monday, July 6, 2026
E-PAPER
Homeజాతీయంభారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం

భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం

- Advertisement -

దేశ వాణిజ్య రాజధాని అతలాకుతలం
కుర్లాలో చెట్టు కూలి వృద్ధుడు మృతి
రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం పలు విమానాలు రద్దు

ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు, ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఆది వారం ఇండిగోకు చెందిన నాలుగు విమానాలు రద్దు కాగా వివిధ సంస్థలకు చెందిన 13 ల్యాండింగ్ విమానాలను సమీపంలోని విమా నాశ్రయాలకు దారి మళ్లించామని అధికారిక వర్గాలు చెప్పాయి. అవి సురక్షితంగా ముంబయిలోనే ల్యాండ్ అయ్యాయని వివరించాయి.

​రెడ్ అలర్ట్
భారీ వర్షాలతో ముంబయిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనితో వాహనాల రాకపోకలు స్తంభించా యి. మెట్రో మార్గాల్లోనూ అంతరాయం ఏర్పడింది. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రపు అలలు 4.19 మీటర్ల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజల కోసం 1916 హెల్ప్లైన్ నంబర్‌‌ను బీఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.భారీ వర్షాలు, ఈదురు గాలులతో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 90 శాతం విమానాలు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. రావాల్సిన విమానాల్లో 45 శాతం ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదానీ గ్రూప్, ఎయిర్‌‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సంయుక్తంగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు విమానాశ్రయ అధికారులు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఉదయం సుమారు 10.17 గంటల సమంయలో గంటకు 42 నాట్స్ వేగంతో వీచిన బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా విజిబిలిటీ తగ్గింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రన్వే కార్యకలాపాలు ప్రభావం చూపాయి. నియమ, నిబంధనల ప్రకారం, ప్రయాణికులు, విమానాలు, గ్రౌండ్ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని రన్వే కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాం’’ అని వివరించారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, ఒక గంట వ్యవధిలోనే రన్‌‌వేపై సాధారణ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైనట్టు వారు తెలిపారు.

చెట్టు కూలి వృద్ధుడు మృతి
కుర్లాలోని కమాని ప్రాంతంలోని నవపాడలో ఒక చెట్టు కూలడంతో యూనస్ కుందవాలా (63) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవపాడలోని బీఎంసీ పాఠశాల సమీపంలోని గోమ్స్ గౌన్ బిల్డింగ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలి కారణంగా ఒక పెద్ద చెట్టు పక్కనే ఉన్న దుకాణంపై పడిపోయింది. ఆ సమయంలో యూనస్ కుందవాలా దుకాణంలో ఉన్నారు. భారీ చెట్టు పడడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను ఆస్ప త్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, బాధితుడు మార్గమధ్యంలోనే మరణించాడు.

అంబానీ కాన్వాయ్‌‌కి తప్పిన ప్రమాదం
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కాన్వాయ్‌‌కి ఆదివారం పెను ప్రమాదం తప్పింది. పశ్చిమ శివారులోని బంద్రా ప్రాంతంలో ఒక భారీ చెట్టు అంబానీ కాన్వాయ్ ముందే కూలిపోయింది. దీనితో అందులోని వారికి పెను ప్రమాదం తప్పింది. చెట్టు కూలడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే అధికారులు సదరు చెట్టును తొలగించి ట్రాఫిక్‌‌ను క్లియర్‌ ‌చేయించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -