ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికన్ల అసంతృప్తి … పడిపోతున్న రేటింగ్
వాషింగ్టన్ : పొగడ్తలకు పొంగని వారు మనకు చాలా అరుదుగా కన్పిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పొగడ్తలకు పొంగిపోతారు. ఆయన చుట్టూ తరచుగా వందిమాగధులైన క్యాబినెట్ సహచరులు, అధికారులు కన్పిస్తుంటారు. తన అభిమానాన్ని కోల్పోయిన ప్రపంచ నేతలపై ట్రంప్ దాడి చేస్తుంటారు. తన ఆదేశాలు పాటించేలా అమెరికాలోని కొన్ని బడా కార్పొరేషన్లపై ఒత్తిడి కూడా తెస్తారు. అధ్యక్ష భవనంలో తన రెండో పదవీ కాలంలో సుమారు సగ భాగాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో తన అధికా రానికి పరిమితులే లేవని ట్రంప్ ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రెండున్నర శతాబ్దాల క్రితం బ్రిటిష్ రాచరిక పాలన నుంచి అమెరికా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నప్పు డు ప్రారంభమైన ‘అమెరికన్ ప్రయో గం’ అనే భావనకు ఇది పూర్తి భిన్నం గా ఉంది.
ఉధృతంగా ‘నో కింగ్’ నిరసనలు
అమెరికాలోనూ, ప్రపంచంలోని వివిధ దేశాలలోనూ ట్రంప్‌కు వ్యతిరే కంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగిన విషయం తెలిసిందే. ‘రాజ్యాలు వద్దు’, ‘రాచరికం కాదు… ప్రజాస్వా మ్యం కావాలి’, ‘మాకు రాజ్యాంగం ఉంది…రాజు కాదు’ అంటూ ఆందో ళనకారులు నినాదాలు చేశారు. అధికార విస్తరణకు గత అధ్యక్షు లెవ్వరూ సాహసించలేదని, అలాంటిది ట్రంప్ ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని మరింత ముందుకు తీసుకొని పోతున్నా రని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నో కింగ్స్’ నిరసనలపై విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా ‘నేను రాజును అని అనుకోవడం లేదు. ఏవైనా పను లకు ఆమోదం పొందాలంటే నరకంగా ఉంది’ అని అన్నారు.
ఏకపక్ష నిర్ణయాలు
ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించ డానికి ముందు ట్రంప్ కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదు. అలాగే వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించడానికి చేపట్టిన సైనిక చర్య గురించి చాలా మంది చట్టసభ సభ్యులకు సమాచారమే లేదు. ప్రపంచ దేశాలపై వాణిజ్య సుంకాలు విధించే ముందు దానికి సంబంధించి చట్టం చేయాల్సిన అవసరం లేకుండానే తన అత్యవసర అధికారాలను ఉపయోగించారు. అయితే ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆ తర్వాత తీర్పు చెప్పింది. అది వేరే విషయం. ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీతో పాటు తన ప్రత్యర్థులుగా భావించే వారిపై దర్యాప్తు చేయడానికి ట్రంప్ న్యాయ శాఖను వాడుకున్నారు.
అధికారంపై అంతులేని మోజు
అమెరికా విధానాలలో, ప్రభుత్వంలోని అన్ని విభాగాలలో సమగ్రమైన మౌలిక మార్పులు తీసుకువస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చారు. దీనిని నమ్మే చాలా మంది ఓటర్లు ట్రంప్‌కు మద్దతు ఇచ్చారు. అయితే తాజా సర్వేలలో ట్రంప్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. తాజా యూగవ్స్ పోల్స్ ప్రకారం ఆయన రేటింగ్ 40 శాతం కంటే తక్కువగానే ఉంది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సమయంలో ట్రంప్‌కు ఉన్న రేటింగుతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అధికారాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నించిన అమెరికా అధ్యక్షులలో ట్రంప్ మొదటి వాడేమీ కాదు. అయితే ఆ విషయంలో చాలా దూరం వెళ్లిన, అధికారంపై ఇంతగా మోజు పడిన అధ్యక్షుడు మరొకడు లేడని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఒకే వ్యక్తి చేసిన విస్తృత అధికారాలు కేంద్రీకృతం కావడం మంచిది కాదని అమెరికా వ్యవస్థాపక నేతలు అనాడు అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడికి బదులు దేశాన్ని నడిపేందుకు కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కొందరు సూచించారు. అయినా అవేవీ కార్యరూపం దాల్చలేదు.
అధికారానికి పరిమితులే లేవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



