నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 9,10 మరియు 11వ తేదీలలో గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్ నందు జరగబోయే జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ కు ఉమ్మడి జిల్లాల యొక్క హాకీ సెలక్షన్ సోమవారం నిర్వహించారు. ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన 18 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు పంపడం జరుగుతుందని జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ విశాఖ గంగారెడ్డి ప్రధాన కార్యదర్శి సదమస్తుల రవణలు తెలిపారు. ఎంపికైన జట్టు 8వ తేదీన ఉదయం నిజామాబాద్ నుండి బయలుదేరుతుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గోనె లహరి రఘు విచ్చేసి ,ఆర్మూర్ అంటే క్రీడలకు పుట్టినిల్లు అని చెబుతూ, ఎంపికైన క్రీడాకారులు అందరు కూడా రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి మన జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్రీడా కోటను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇటీవలే పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు విశాఖ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, ఈసీ మెంబర్ సడక్ నాగేష్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.



