నవతెలంగాణ-ఆర్మూర్
ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు సోమవారం పాలాభిషేకం నిర్వహించారు.
కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దేగాం ప్రమోద్ మాట్లాడుతూ..రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి రైతు భరోసా పథకం ఎంతో ఉపయోగపడుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూరుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలూర్ సర్పంచ్ ముక్కెర విజయ్,ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్లేడి అధ్యక్షులు నిలగిరి శ్రీనివాస్,కాంగ్రెస్ జిల్లా నాయకులు మూలకిడి శ్రీనివాస్ రెడ్డి,పస్కా నర్సయ్య జిల్లా సెక్రటరీ,దెగాం శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ మోతిరం,నాయకులు ప్రభాకర్, శశి,జితేందేర్,గంగారెడ్డి, ఉదయ్,నవనీత్, భాస్కర్,నారాయణ, చిరంజీవి నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



