కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ నాయకా నాయికలుగా అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ`. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.
ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. సోమవారం ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మీడియాతో ముచ్చటించారు.
మన తెలుగు జంట చెన్నైలో నివసిస్తుంటారు. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీఅని సినిమా టైటిల్ పెట్టాం. 'బేబి సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత మాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఒక మంచి మూవీతోనే ఆడియెన్స్ ముందుకు రావాలని ఏడాది సమయం తీసుకున్నాం. సాయి రాజేష్ చెప్పిన ఈ కథ, కథనం బాగా నచ్చాయి. మా కాంబోలోనే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నాం.
ప్రస్తుతం మా సినిమా తెలుగు రిలీజ్ వర్క్స్ స్పీడ్ గా జరుగు తున్నాయి. తమిళ్ రిలీజ్ అదే వారం చేయాలా, ఒకట్రెండు వారాలు ఆగి చేయాలా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే తమి ళంలో కొన్ని పెద్ద మూవీస్ రిలీజ్ కు వస్తున్నాయి.
మేము అనుకున్న కథకు కిరణ్ అబ్బవరం వందశాతం న్యాయం చేశారు. ఆయన ఇప్పటిదాకా బాయ్ నెక్ట్స్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. మాస్ క్యారెక్టర్స్ లో నటించారు. కిరణ్ నటనలోని ఒక మెచ్యూరిటీని ఈ సినిమాలో చూస్తారు. ఈ ఏడాది అన్ని అవార్డ్స్ లో కిరణ్ పేరు నామి నేషన్స్ లో ఉంటుందని మాత్రం గట్టిగా చెప్పగలను.
సాయి రాజేష్ కథల్లో హీరోయిన్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథ అనుకున్నాక, ఇంత బలమైన పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది, ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని డిస్కషన్స్ చేశాం. మేము తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తున్నాం. శ్రీ గౌరి ప్రియను సెలెక్ట్ చేసు కున్నాం. ఆమె ఈ పాత్రకు న్యాయం చేసింది. ఇందులోని ఎమోషన్స్ చాలా రోజులు గుర్తుంటాయి.
తొలిప్రేమ అయినా మలిప్రేమ అయినా మన జీవితంలో భాగమే. తొలి ప్రేమ దక్కని వారిలో మళ్లీ ప్రేమ పుట్టదని చెప్పలేం. ఏదైనా జీవితం ముందుకు సాగాల్సిందే. ‘బేబిసినిమాను తొలి ప్రేమ నేప థ్యంగా నిర్మిస్తే, ఇందులో మలి ప్రేమ కూడా గొప్పదే అని చెబు తున్నాం. 'బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్ల సమయం తీసు కుని చేసేమంటే మాదైన ఒక మార్క్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.
‘బేబి` సినిమాకు కల్ట్ లవ్ స్టోరీ అని పేరొచ్చింది. ఈ సినిమాకు క్లాసి క్ లవ్ స్టోరీ అనే పేరొస్తుంది. మణి శర్మ సంగీతం, నేపథ్య సంగీతం అనంత శ్రీరామ్ పాటలు మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తాయి.
మలి ప్రేమ కూడా గొప్పదని చాటే సినిమా
- Advertisement -
- Advertisement -



