కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ మున్సిపల్ చైర్మన్

నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్

హుస్నాబాద్ పట్టణంలో గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి ,కౌన్సిలర్లు కొంకటి నళినీ దేవి, చిత్తారి పద్మ, భూక్య సరోజన, దొడ్డి శ్రీనివాస్, బొజ్జ హరీష్, కోఆప్షన్ సభ్యులు యండి ఆయూబ్ , కోమటి సత్యనారాయణ, పున్న సది, రాజయ్య గిర్ధవర్, మొహమ్మద్ కరీం జూనియర్ అసిస్టెంట్, రాజు,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love