ఈ నెల 16 న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో గిరిజన మంత్రి సితక్కతో పాటు 12 మంది గిరిజన ఎమ్మెల్యేలకు గిరిజన ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం కార్యక్రమానికి అధిక సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుగులోతు వీరన్న నాయక్ పత్రిక ప్రకటనలో తెలిపారు. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఆత్మీయ సత్కార కార్యక్రమంలో భాగంగా గిరిజన తెగలతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి కార్యక్రమానికి రాష్ట్రంలో 33 తెగలుగా ఉన్న గిరిజనులు, గిరిజన ఉద్యోగ, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.