Tuesday, July 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ రహదారిపై గుంతలను పూడ్చిన యువకులు

జాతీయ రహదారిపై గుంతలను పూడ్చిన యువకులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు స్థానిక యువకులు పూడ్చివేశారు. ఈ గుంతల గుండా ప్రయాణించే వాహనదారులు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు.గతంలో కూడా రోడ్డుపై ఉన్న ఈ గుంతల్లో పడి ఇద్దరు ముగ్గురు ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలయ్యారు. సోమవారం రాత్రి కూడా  వాహనదారుడు ఈ గుంతల వద్ద ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. దీంతో స్పందించిన స్థానిక యువకులు రాత్రి సుమారు 10 గంటల సమయంలో జాతీయ రహదారిపై ఏర్పడ్డ గుంతలను మట్టితో పూడ్చి చదును చేశారు. రాత్రి వేళలో కూడా స్పందించి జాతీయ రహదారిపై గుంతలు పూడ్చిన రూపా ప్రింటింగ్ ప్రెస్ ప్రవీణ్,  అంబుదాస్, పూజా దుకాణం రాజు, ఫేమస్ టైలర్ నవీన్ లను గ్రామస్తులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -