నవతెలంగాణ-హైదరాబాద్ : స్మార్ట్ హోమ్ ఆవిష్కరణలో ప్రపంచ దిగ్గజం అయిన డ్రీమ్ టెక్నాలజీ, ఇండియాలో డ్రీమ్ L50 ప్లస్ మరియు డ్రీమ్ L50 అనే రెండు వాల్యూ-ప్యాక్ చేయబడిన, అధిక సక్షన్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లను ఆవిష్కరిస్తున్నట్లుగా ఈరోజు ప్రకటించింది. కంపెనీ యొక్క ఇంటెలిజెంట్ హోమ్ క్లీనింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, ఈ తాజా ఉత్పత్తులు ఆకట్టుకునే ధరకే, తమ ఇళ్లను మరింత చక్కగా నిర్వహించుకోవాలని కోరుకునే ఎక్కువ మంది భారతీయ వినియోగదారులకు శక్తివంతమైన సక్షన్, స్మార్ట్ ఆటోమేషన్ మరియు మెరుగైన సౌకర్యాన్ని తీసుకువచ్చేలా రూపొందించబడ్డాయి.
అధునాతన గృహాల కోసం రూపొందించబడిన ఈ కొత్త L50 సిరీస్ యందలి డ్రీమ్ యొక్క శక్తివంతమైన 25,000Pa వోర్మాక్స్™ సక్షన్, అంచుల నుండి మూలల వరకు మెరుగైన శుభ్రత కోసం మాప్‌ఎక్స్‌టెండ్™ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ – రోటరీ మాప్ ప్యాడ్‌లు, మరియు శుభ్రపరిచే సమయంలో కార్పెట్లను ఆటోమేటిక్‌గా పొడిగా ఉంచే ఇంటెలిజెంట్ 10.5mm మాప్ లిఫ్ట్‌ను సమ్మిళితం చేస్తూ అధునాతన శుభ్రపరిచే టెక్నాలజీల కలయికను అందించే ఈ ధరల విభాగంలోని ఏకైక ఉత్పాదన అవుతోంది.
తెలివైన నావిగేషన్, అడ్డంకులను తప్పించుకునే అధునాతన వ్యవస్థ, చిక్కుపడని బ్రష్ టెక్నాలజీ, అనుకూలీకృతమైన వాక్యూమింగ్ మరియు మాపింగ్ ఫంక్షన్‌లు, అధిక బ్యాటరీ లైఫ్, ఇంకా యాప్ ఆధారిత నియంత్రణలతో కూడిన డ్రీమ్ L50 సిరీస్, రోజువారీ ఇంటి సంరక్షణను సులభతరం చేయడానికి రూపొందించబడి, అతుకులు లేకుండా, చేతులు ఉపయోగించకుండా శుభ్రపరిచే అనుభవాన్ని అందిస్తుంది.
డ్రీమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ గారు ఇలా అన్నారు, “భారతీయ వినియోగదారులు స్మార్ట్ జీవన విధానాన్ని ఎక్కువగా స్వీకరిస్తుండగా, రోజువారీ జీవితంలో సజావుగా కలిసిపోతూ, అర్థవంతమైన సౌకర్యాన్ని, సమర్థతను అందించే సాంకేతికతల పట్ల పెరుగుతున్న గిరాకీని మనం చూస్తున్నాము. డ్రీమ్ వద్ద, రోజువారీ పనులను సులభతరం చేసే మరియు అధునాతన గృహ శుభ్రతా సాంకేతికతను మరింత అందుబాటులోనికి తెచ్చి, సరసమైనదిగా చేసే తెలివైన పరిష్కారాలను అభివృద్ధి చేయడంపై మా దృష్టి సారింపు ఉంటోంది. డ్రీమ్ L50 ప్లస్ మరియు L50ల ఈ ఆవిష్కరణ, ఈ ధరల విభాగంలో ఒక కొత్త పరిశ్రమ ప్రమాణాన్ని నెలకొల్పే అంశాల సమ్మేళనంలో, కేటగిరీలో అగ్రగామిగా నిలిచే సక్షన్ శక్తి, తెలివైన తుడుపు సామర్థ్యాలు మరియు అధునాతన ఆటోమేషన్‌ను ఒకేచోట చేర్చి, ఆవిష్కరణల ద్వారా మరింత తెలివైన జీవనాన్ని సుసాధ్యం చేయాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని ఆయన అన్నారు.
డ్రీమ్ L50 ప్లస్
శక్తివంతమైన శుభ్రతా పనితీరును ఈ డ్రీమ్ L50 ప్లస్ తెలివైన ఆటోమేషన్‌తో సమ్మిళితం చేస్తుంది, అందువల్ల చేతులు ఉపయోగించకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలనుకునే వినియోగదారులకు ఇది ఒక ఉత్తమమైన పరిష్కారం.
దీని ముఖ్యాంశాలలో ఇవి ఉంటాయి:
· 120 రోజుల పాటు చేతులు-ఉపయోగించని దుమ్ము సేకరణ: L50 ప్లస్ అనేది 120 రోజుల వరకు చేతులు ఉపయోగించకుండా శుభ్రపరచడానికి వీలు కల్పించి మరియు తరచుగా మెయింటెనెన్స్ అవసరాన్ని తగ్గించే పెద్ద 5L డస్ట్ బ్యాగ్‌తో కూడిన ఆటోమేటిక్ దుమ్ము సేకరణ వ్యవస్థను కలిగి ఉంది.
· శక్తివంతమైన 25,000Pa వోర్మాక్స్™ సక్షన్: డ్రీమ్ యొక్క అధునాతన వోర్మాక్స్™ సక్షన్ టెక్నాలజీతో పనిచేసే L50 ప్లస్, గట్టి నేలలు, కార్పెట్ల వ్యాప్తంగా సమర్థవంతంగా దుమ్ము, చెత్త, పెంపుడు జంతువుల వెంట్రుకలు మరియు సూక్ష్మ కణాలను తొలగించడానికై అద్భుతమైన 25,000 Pa సక్షన్ శక్తిని అందిస్తుంది.
· మాప్ఎక్స్‌టెండ్™ టెక్నాలజీతో డ్యుయల్ రోటరీ మాప్ పాడ్‌లు: డ్యూయల్-రోటరీ మాప్ ప్యాడ్‌లను డ్రీమ్ యొక్క మాప్‌ఎక్స్‌టెండ్™ టెక్నాలజీతో సమ్మిళితం చేసి, నేల అంచుల నుండి మూలల వరకు లోతైన శుభ్రతను ఈ L50 ప్లస్ అందిస్తుంది. ఇది స్కర్టింగ్ బోర్డులు, మూలలు మరియు చేరుకోవడానికి కష్టంగా ఉండే ఇతర ప్రదేశాలను సమర్థవంతంగా చేరుకుని, నేలను మరింత సమగ్రంగా శుభ్రపరుస్తుంది.
· డ్యుయల్ యాంటీ-ట్రయాంగిల్ సిస్టమ్: ఈ రోబో వాక్యూములో ప్రత్యేకంగా రూపొందించిన యాంటీ-ట్యాంగిల్ మెయిన్ బ్రష్ మరియు సైడ్ బ్రష్ సిస్టమ్ ఉన్నాయి, ఇవి వెంట్రుకలు చిక్కుపడిపోవటాన్ని తగ్గించి, నిరంతర శుభ్రతా పనితీరును అందిస్తాయి.
· 10.5mm ఇంటెలిజెంట్ మాప్ లిఫ్ట్: L50 ప్లస్ కార్పెట్‌లను ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది, లోతైన శుభ్రత కోసం సక్షన్ శక్తిని పెంచుతుంది, మరియు గట్టి నేలలు మరియు కార్పెట్ ఉపరితలాల మధ్య అంతరాయం లేకుండా మారుతూ కార్పెట్లను పొడిగా ఉంచడానికి గాను దాని డ్యూయల్-రోటరీ మాప్ ప్యాడ్‌లను 10.5 మిమీ వరకు పైకి లేపుతుంది.
· తెలివైన న్యావిగేషన్ మరియు అడ్డంకి నివారణ: స్మార్ట్ పాత్‌ఫైండర్™ నావిగేషన్ మరియు సింగిల్-లేజర్ 3D స్ట్రక్చర్డ్ లైట్ అడ్డంకులను తప్పించుకునే వ్యవస్థతో కూడిన ఈ L50 ప్లస్, ఇళ్లను కచ్చితంగా తుడుస్తుంది, సమర్థవంతమైన శుభ్రతా మార్గాలను నెలకొల్పుతుంది మరియు ఫర్నిచర్, గృహ అడ్డంకుల చుట్టూ తిరుగుతుంది.
· 2-ఇన్-1 వాక్యూమింగ్ మరియు మాపింగ్: డ్రీమ్ L50 ప్లస్ ఒకే క్లీనింగ్ విడతలో వాక్యూమింగ్ మరియు తుడుపును సమ్మిళితం చేస్తూ, దుమ్ము, చెత్త మరియు రోజువారీ మరకలను సమర్థవంతంగా తొలగిస్తుంది. 300ml నీళ్ళ ట్యాంక్, 230ml డస్ట్ బాక్స్ మరియు 32-స్థాయి నీటి ప్రవాహ సర్దుబాటుతో, ఇది కనీస శ్రమతో సమర్థవంతమైన మరియు అనుకూలీకృతమైన ఫ్లోర్ క్లీనింగ్‌ను అందిస్తుంది.
డ్రీమ్ L50
అందుబాటు ధరలో తెలివైన శుభ్రతా పనితీరును అందించడానికై రూపొందించబడిన డ్రీమ్ L50, శక్తివంతమైన సక్షన్, స్మార్ట్ నావిగేషన్ మరియు వ్యక్తిగతీకృత శుభ్రతా నియంత్రణలను సమ్మిళితం చేస్తుంది.
ముఖ్యాంశాలలో ఇవి ఉంటాయి:
· ఇంటెలిజెంట్ కార్పెట్ క్లీనింగ్ తో 25,000Pa శక్తివంతమైన సక్షన్: 25,000Pa వరకు సక్షన్ శక్తిని అందించే డ్రీమ్ L50, గట్టి నేలలు మరియు కార్పెట్ల నుండి దుమ్ము, ధూళి, పెంపుడు జంతువుల రోమాలు మరియు చెత్తను సమర్థవంతంగా తొలగిస్తుంది. అల్ట్రాసోనిక్ కార్పెట్ గుర్తింపుతో, ఈ రోబో కార్పెట్లను ఆటోమేటిక్ గా గుర్తించి, సక్షన్ శక్తిని పెంచి, మరింత లోతైన మరియు సమర్థవంతమైన శుభ్రతను అందించడానికై క్లీనింగ్ సెట్టింగ్‌లను సర్దుబాటు చేస్తుంది.
· 10.5mm ఇంటెలిజెంట్ మాప్ లిఫ్ట్ తో డ్యుయల్-రోటరీ మాప్ పాడ్‌లు: మాప్ఎక్స్‌టెండ్™ టెక్నాలజీతో డ్యుయల్ రోటరీ మాప్ ప్యాడ్‌లను కలిగి ఉన్న L50, కష్టమైన అంచులు మరియు మూలలను చేరుకోవడానికై మాప్‌ను పొడిగించడం ద్వారా, అంచుల నుండి మూలల వరకు లోతైన శుభ్రతను అందిస్తుంది. దీని తెలివైన మాప్-లిఫ్టింగ్ సిస్టమ్ కార్పెట్లు పొడిగా ఉండేలా సహాయపడటంతో పాటు, శుభ్రతా పనితీరుకు అంతరాయం కలగకుండా చూసుకుంటూ కార్పెట్లను గుర్తించినప్పుడు మాప్ ప్యాడ్‌లను 10.5mm వరకు ఆటోమేటిక్‌గా పైకి లేపుతుంది.
· అడ్డంకి నివారణతో LDS న్యావిగేషన్: LDS లేజర్ నావిగేషన్, గ్లోబల్ రూట్ ప్లానింగ్ మరియు సింగిల్-లైన్ లేజర్ అడ్డంకుల నివారణ ఫీచర్లతో, L50 తెలివిగా ఇంటిని తుడుస్తుంది, ఫర్నిచర్ మరియు ఇంటి వస్తువుల చుట్టూ తిరుగుతుంది, ఇంకా క్రమమైన పద్ధతిలో, ఇంటిని పూర్తిగా శుభ్రపరుస్తుంది.
· అనుకూలీకృతం చేసుకోదగిన శుభ్రతా పనితీరు: 5 సక్షన్ లెవెల్స్ మరియు 32 వాటర్ వాల్యూమ్ సర్దుబాటు స్థాయిలతో కూడిన ఈ L50, వివిధ రకాల ఫ్లోరులు, గది అవసరాలు మరియు శుభ్రతా ప్రాధాన్యతల ఆధారంగా శుభ్రతా తీవ్రతను తమకు నచ్చినట్లుగా మార్చుకోవడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.
· పొడిగింపు రన్-టైమ్ కోసం 5200mAh బ్యాటరీ: అధిక-సామర్థ్యపు 5200mAh బ్యాటరీతో పనిచేసే L50, 250 నిమిషాల రన్‌టైమ్‌ను అందిస్తుంది, దీనివల్ల పెద్ద ఇళ్లలో మరియు అనేక గదులలో కూడా అంతరాయం లేకుండా శుభ్రపరచడం సాధ్యమవుతుంది.
· స్మార్ట్ యాప్ కంట్రోల్ మరియు పెట్-ఫ్రెండ్లీ డిజైన్: డ్రీమ్ యాప్ ద్వారా, వినియోగదారులు మల్టీ-లెవెల్ మాపింగ్, రూమ్ జోనింగ్, శుభ్రతా షెడ్యూల్స్ మరియు వాయిస్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ప్రాప్యత చేసుకోవచ్చు. పెంపుడు జంతువులు ఉండే ఇళ్ల కోసం రూపొందించబడిన L50, దానిలో పొందుపరిచిన యాంటీ-ట్యాంగిల్ బ్రష్ డిజైన్ ద్వారా వెంట్రుకలు చిక్కుపడటాన్ని తగ్గిస్తూ, పెంపుడు జంతువుల వెంట్రుకలను మరియు రోజువారీ చెత్తలను సమర్థవంతంగా చేపడుతుంది.
· అంతరాయం-లేని మెయింటెనెన్స్ కోసం 0% హెయిర్ ట్యాంగ్లింగ్: డ్రీమ్ యొక్క అధునాతన యాంటీ-ట్యాంగిల్ టెక్నాలజీతో రూపొందించబడిన L50, మెయిన్ బ్రష్ మరియు సైడ్ బ్రష్ రెండింటిపై ఏ మాత్రమూ వెంట్రుకలు చిక్కుపడకుండా చేస్తుంది. ఇది పొడవాటి జుట్టు, పెంపుడు జంతువుల వెంట్రుకలు మరియు రోజువారీ చెత్తను సమర్థవంతంగా తొలగిస్తూ, చేతితో శుభ్రపరచే మరియు నిర్వహణ చేసే అవసరాలను గణనీయంగా తగ్గిస్తుంది.
ధర మరియు లభ్యత
డ్రీమ్ ఎల్50 ప్లస్ రూ. 34,999 ధరతో అందుబాటులో ఉండగా, డ్రీమ్ ఎల్50 రూ. 27,999 ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఉత్పత్తులూ జూలై 6వ తేదీ నుండి అమెజాన్ ఇండియా మరియు డ్రీమ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి.
విక్రయానంతర మద్దతు మరియు వ్యారెంటీ
డ్రీమ్ L50 ప్లస్ మరియు L50 లు 1 సంవత్సరం వారంటీతో వస్తాయి మరియు ఇండియా వ్యాప్తంగా 160కి పైగా నగరాల్లో విస్తరించి ఉన్న డ్రీమ్ యొక్క దేశవ్యాప్త విక్రయానంతర సేవా నెట్‌వర్క్ మద్దతును కలిగి ఉంటాయి. అర్హత ఉన్న ప్రదేశాలలో, వినియోగదారులు పికప్ మరియు డ్రాప్ సహాయం, ఇన్‌స్టలేషన్ తోడ్పాటు వంటి ప్రత్యేక మద్దతు సేవలను కూడా తీసుకోవచ్చు.



