- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జన్మదిన వేడుకలు ఆలేరు పట్టణంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు కె సాగర్ రెడ్డి, కే వెంకటేశ్వరరాజు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -


