నవతెలంగాణ-మిడ్జిల్
గ్రామాలు అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు మంజూరు చేస్తుందని. గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని పాలమూరు ఎంపీ డీకే అరుణ చెప్పారు. బుధవారం మండలంలోని లింబ్య తాండ గ్రామపంచాయతీలో అన్ని స్తంభాలకు రూ.4 లక్షలతో ఎల్ఈడి లైట్లు, రాణి పేట పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి రూ.8 లక్షలతో కస్తూర్బా పాఠశాలలో ఐమాక్స్ లైటు , వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేస్తా సమావేశాల్లో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. కస్తూరిబా పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు రాష్ట్ర నాయకులు జనార్దన్ రెడ్డి, రాజేశ్వర్, బాల త్రిపుర సుందరి, శ్రీనివాస్ గౌడ్, సాహితీ రెడ్డి, పల్లె తిరుపతి, కిరణ్ కుమార్ ,ఆనందు, రామకృష్ణ ,రాఘవేందర్ గౌడ్, లక్ష్మయ్య, వెంకట్ రెడ్డి ,శేఖర్ రెడ్డి, ఆంజనేయులు, శేఖరు ,వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి: ఎంపీ డీకే అరుణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



