Thursday, July 9, 2026
E-PAPER
Homeక్రైమ్ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 

ట్రైబల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 

- Advertisement -

26 మంది విద్యార్థులకు అస్వస్థత
పరామర్శించిన ఆర్డిఓ, డీఎస్పీ 
నవతెలంగాణ-అచ్చంపేట
అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని ట్రైబల్ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ అయింది. టిఫిన్ చేసిన కొద్దీ సేపటికి 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రిన్సిపల్ సిబ్బంది సాయంతో విద్యార్థులను చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, డి.ఎస్.పి శ్రీనివాసులు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా..ఢిల్లీ పర్యటనలో ఉన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జరిగిన సంఘటన విషయాన్ని తెలుసుకొని ఫుడ్ పాయిజన్ కు బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -