- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పిఎసిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఆలేరు నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకమండల్లను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైతు సంక్షేమం సహకార సంఘాల వ్యవస్థ బలోపేతం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ నియామకాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు.
- Advertisement -



