మిత్రదేశాలకు ట్రంప్ షరతులు
మిల్డెన్‌హాల్ : యూరప్‌లో అమెరికా సైన్యం ఉండాలంటే మిత్రదేశాలు రెండు షరతులను పాటించాల్సి ఉంటుందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గ్రీన్‌లాండ్‌పై తన ఆశయాలకు సహకరించాలని, ఇరాన్‌పై సైనిక చర్యకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిల్డెన్‌హాల్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ (ఆర్ఏఎఫ్) వైమానిక కేంద్రంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. అమెరికా సైనిక చర్యకు మద్దతు ఇస్తూ ఇరాన్‌ను ఏకాకిని చేసేందుకు యూరోపియన్ దేశాలు సుముఖత ప్రదర్శించకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. అమెరికాకు సాయం అందించే విషయంలో ఆ దేశాలు ఆలస్యంగా ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. ‘అంతా గ్రీన్‌లాండ్, ఇరాన్‌పై ఆధారపడి ఉంది. వారు ఇప్పుడు సాయం చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటికే కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చేయడానికి పోరాటం లేదు. వారికి అవకాశం ఉన్నప్పుడు సాయం చేయకూడదని అనుకున్నారు. అయితే మనం ఆ విషయాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడేమో ఇరాన్ విషయంలో సాయం చేయాలని ఆరాటపడుతున్నారు. కానీ మనకు నిజంగా సాయం అవసరం లేదు’ అని అన్నారు. గ్రీన్‌లాండ్ అమెరికా నియంత్రణలోనే ఉండాలని ట్రంప్ నాటో సదస్సులో పునరుద్ఘాటించిన విషయం తెలిసిందే. ఆ ఆర్కిటిక్ ద్వీపం అమెరికా భద్రతకు వ్యూహా త్మకమైనదని ఆయన వాదించారు. అంతకుముందు జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ సాధించడం వాషింగ్టన్-దాని మిత్రదే శాల సంబంధాలను ప్రభావితం చేయవచ్చునని అంగీకరిం చారు. అయితే అది నాటోతో తన సంబంధాలను దెబ్బతీస్తుందని చెప్పారు.
యూరప్‌లో మా సేనలు ఉండాలంటే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



