- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ సావిత్ర సాయా గౌడ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మండలంలోని ఇందిరా క్రాంతి పథకంలోని మహిళా మండలి సభ్యులకు రక్త పరీక్షలతో పాటు ఇతర సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్, మండల సర్పంచ్ల అధ్యక్షులు చాకలి కృష్ణ, మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ పటేల్, మండల కురుమ అధ్యక్షులు కండుగొండ, సంతప్ప, గంగు నాయక్, మనోహర్ పటేల్, ఆరోగ్య సిబ్బంది, ఐకెపి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -


