– నియోజకవర్గంలో 45,802 మంది రైతులకు లబ్ధి
– రూ.87.66 కోట్లు జమ
– ముగిసిన రైతు భరోసా పంపిణీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం–2026 సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీని పూర్తి చేసింది. శుక్రవారం నిర్వహించిన రైతు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 54 ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 45,802 మంది పట్టాదారు రైతుల ఖాతాల్లో మొత్తం రూ.87.66 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) పెంటేల రవికుమార్ తెలిపారు.
ఈ నిధులతో రైతులు వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ఆర్థికంగా తోడ్పాటు లభించనుందని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా నిధుల విడుదలతో నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



