Saturday, March 7, 2026
E-PAPER
Homeజిల్లాలుపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు బట్టల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హసా కొత్తూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక తెడ్డు వసుందర రమేష్ దంపతులు బట్టలను పంపిణీ చేశారు. తమ కూతురు డాక్టర్ తెడ్డు కస్తూరి  జన్మదినం సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, పారిశుద్ధ్య కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా తెడ్డు వసుందర రమేష్ దంపతులు మాట్లాడుతూ తమ కూతురు జన్మదినం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందరి సమక్షంలో జరపడం చాలా సంతోషంగా ఉందన్నారు.

పారిశుద్ధ్య కార్మికులు  చేసే పనిలో పూర్తి నిబద్ధతతో చేసి గ్రామానికి, సర్పంచ్ కు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. భవిష్యత్ లో పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి అవసరాలకైన తమ కుటుంబం ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  నలిమెల రేవతి గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నవీన్ గౌడ్, పాలక వర్గం సభ్యులు రాధారపు గంగాధర్,క నక నర్సయ్య, మాజీ ఎంపీటీసీ జంగం మహేష్, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -