Saturday, July 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమేం కట్టిన ప్రాజెక్టులు చెక్కుచెదరలేదు

మేం కట్టిన ప్రాజెక్టులు చెక్కుచెదరలేదు

- Advertisement -

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-చింతకాని/బోనకల్‌

కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఖమ్మం రైతాంగం మద్దతుగా నిలిచిందని, రైతుల సూచన మేరకే రైతు భరోసా సభను ఆశీర్వాద సభగా ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు ఆశీర్వాద సభలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన వందలాది క్యూసెక్కుల ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం మాత్రం కూలేశ్వరం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్‌ ‌గానీ, శ్రీశైలం గానీ, ఇతర ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్‌‌పార్టీ నిర్మించిందని గుర్తు చేశారు. వర్తమానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, భవిష్యత్తులో తామే అధికారంలో ఉండి గుంటనక్కల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షిస్తూ ఉంటామని అన్నారు. రైతులతో పాటు మహిళలను మహరాణులుగా చూడాలన్న ఉద్దేశంతో ఇప్పటికే 67 వేల కోట్లు వడ్డీలేని రుణాలిచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినా తమ ప్రభుత్వం ఏ పథకాన్ని ఆపలేదని, ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, బకాయిలు చెల్లించామని, అప్పులు చెల్లిస్తున్నామని, ప్రతి సంక్ష‍ేమ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
​​రెండేళ్లలో ప్రతి రైతుకూ మ్యాప్‌తో కూడిన ‘భూదార్‌’ : పొంగులేటి
భూభారతి ద్వారా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని,రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూమినీ సర్వే చేసి, సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్‌తో కూడిన ‘భూదార్’ కార్డును అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూభారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
​​ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేస్తాం : తుమ్మల
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 30 నెలల్లో 36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు.
​​రైతుల శ్రేయస్సే కాంగ్రెస్ లక్ష్యం : వాకిటి
కాంగ్రెస పార్టీ రైతుల శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, చింతకానిలో ఏర్పాటు చేసిన ఆశీర్వాద సభే సాక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి 9 రోజుల్లో రైతు భరోసాను పూర్తిచేసిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -