Saturday, July 11, 2026
E-PAPER
Homeఖమ్మంసత్తుపల్లి సింగరేణిలో 13వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు

సత్తుపల్లి సింగరేణిలో 13వ రోజుకు చేరిన నిరాహార దీక్షలు

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి : సింగరేణి సంస్థ పరిధిలోని సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనుల అధికారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షల కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. అధికారుల న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన సమూహ నిరాహార దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకు చేరాయి.​తమకు రావలసిన  ప్రయోజనాలను తక్షణమే మంజూరు చేయాలని, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ​వేతన పెంపుదల (పే అప్‌గ్రేడేషన్)​పనితీరు ఆధారిత చెల్లింపులు (పీఆర్పీ) తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ​13వ రోజు  నిరాహార దీక్షలో ​వి. వేణుగోపాల్ రావు,​ఎస్. లోకేష్, ​జి. నరేష్  పాల్గొన్నారు. తమ  సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించి పరిష్కరించాలని, అంతవరకు తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -